తన ప్రేమ రహస్యాలను బయటపెట్టిన శ్రీముఖి.. చనిపోదాం అనుకుందట!
- అంతా బాగున్న సమయంలో డిస్టర్బ్ అయింది
- ఆ తర్వాత రిలేషన్ పూర్తిగా దెబ్బతింది
- అదో అగ్లీ బ్రేకప్
తన వ్యక్తిగత జీవితం గురించి ఇప్పటి వరకు తానెక్కడా బయటపెట్టలేదన్న శ్రీముఖి మాట్లాడుతూ.. తనకు రిలేషన్షిప్ ఉందని, దానినెప్పుడూ బయటపెట్టలేదని పేర్కొంది. అతడితో అంతా ఓకే అనుకున్న సమయంలో తమ రిలేషన్షిప్లో అనుకోకుండా కుదుపులు వచ్చాయని తెలిపింది. ఆ తర్వాత తమ రిలేషన్ పూర్తిగా దెబ్బతిందని వివరించింది. అది తన జీవితంలో ‘అగ్లీ బ్రేకప్’ అని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సమయంలో చనిపోదామన్న ఆలోచన కూడా వచ్చిందని శ్రీముఖి పేర్కొంది.