ఫలితాలకు బాధ్యత వహిస్తూ హర్యానా బీజేపీ చీఫ్ రాజీనామా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫలితాలకు బాధ్యత వహిస్తూ హర్యానా బీజేపీ చీఫ్ రాజీనామా

  • హంగ్ దిశగా హర్యానా ఫలితాలు
  • మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువ స్థానాల్లో బీజేపీ ఆధిక్యత
  • రాజీనామా చేసిన సుభాష్ బరాలా
మహారాష్ట్ర ఫలితాలు బీజేపీ కూటమికి అనుకూలంగా ఉన్నప్పటికీ... హర్యానా ఫలితాలు మాత్రం ఆ పార్టీకి నిరాశను కలిగిస్తున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 46 స్థానాలను కూడా గెలవలేని స్థితిలో బీజేపీ ఉంది. ఇతరులను కలుపుకుంటే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో, ఫలితాలకు బాధ్యత వహిస్తూ హర్యానా బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పంపించారు. మరోవైపు, ఫలితాలు హంగ్ దిశగా వెలువడుతుండటంతో... జేజేపీ కింగ్ మేకర్ పాత్ర పోషించే పరిస్థితి నెలకొంది. 10 స్థానాల్లో ఈ పార్టీ ఆధిక్యంలో ఉంది.
Haryana
Subhash Barala
Resignation
BJP

More Telugu News