గిరిజన ప్రాంతాల్లో పర్యటనకు తెలంగాణ గవర్నర్
- తండాల్లో నిద్ర చేసేందుకు సిద్ధమైన తమిళిసై
- గిరిజన యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహించాలని సూచన
- రాజ్ భవన్లో అధికారులతో చర్చలు
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ములుగులో ఏర్పాటు చేయబోయే గిరిజన యూనివర్శిటీకి కేంద్ర కేబినెట్ నుంచి అనుమతులు తీసుకురావడానికి సహకరిస్తానని తెలిపారు. గిరిజన యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ సందర్భంగా భద్రాచలం, నాగర్ కర్నూలు నుంచి వచ్చిన కోయ, లంబాడాలతో కలిసి ఆమె నృత్యం చేశారు.