తెలుగులోను విజయ్ సినిమాపై పెరిగిన క్రేజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగులోను విజయ్ సినిమాపై పెరిగిన క్రేజ్

  • తమిళంలో 'బిజిల్' భారీ రిలీజ్ 
  • భారీస్థాయిలో జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్
  • రెండు భాషల్లోను ఒకే రోజున విడుదల
అట్లీకుమార్ దర్శకత్వంలో విజయ్ 3వ సినిమాగా 'బిజిల్' చిత్రం రూపొందింది. క్రీడా నేపథ్యంలో సాగే ఈ కథలో నాయికగా నయనతార కనిపించనుంది. డిఫరెంట్ లుక్స్ తో విజయ్ కనిపించనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.  ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగులోను అదే రోజున 'విజిల్' టైటిల్ తో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఇంతకుముందు తమిళంలో విజయ్ చేసిన 'సర్కార్' సినిమా, తెలుగులోను మంచి వసూళ్లను రాబట్టింది. అందువలన తాజా చిత్రమైన 'విజిల్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరిగినట్టుగా చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 9.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్టు చెబుతున్నారు. తెలుగుకి సంబంధించినంత వరకూ, విజయ్ కెరియర్లో భారీస్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమా ఇదేనని అంటున్నారు. కథానాయిక నయనతార కావడం కూడా బిజినెస్ పరంగా కలిసొచ్చిందని చెబుతున్నారు.
Vijay
Nayanatara

More Telugu News