కొత్త తరం వాణిజ్య రాకెట్లను ఆవిష్కరించిన చైనా.. భారత్‌ను దెబ్బకొట్టే ప్రయత్నం!
- అంతరిక్ష ప్రయోగాల మార్కెట్లో భారత్‌ను వెనక్కి నెట్టే ప్రయత్నం
- ‘స్మార్ట్ డ్రాగన్’, ‘టెంగ్లాంగ్’ పేరుతో రెండు రాకెట్ల ఆవిష్కరణ
- 1.5 టన్నుల పేలోడ్‌ను మోసుకుపోగలిగే సామర్థ్యం
అంతరిక్ష ప్రయోగాల్లో చైనా జోరు ప్రదర్శిస్తున్నా ప్రపంచ వాణిజ్య మార్కెట్‌ను ఆకర్షించడంలో మాత్రం భారత్ కంటే వెనకబడే ఉంది. ఈ నేపథ్యంలో ఈ మార్కెట్లో భారత్‌ను వెనక్కి నెట్టేందుకు తాజా రాకెట్లను ఆవిష్కరించినట్టు నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ డ్రాగన్ రాకెట్‌ను వచ్చే ఏడాది ప్రయోగించనుండగా, టెంగ్లాంగ్ రాకెట్‌ను 2021లో ప్రయోగించేందుకు చైనా సిద్ధమవుతోంది.