లోటస్ పాండ్ కు వెళుతుంటే కోటి ఇరవై లక్షలు గాలిలో కలిసిపోతున్నాయి!: జగన్ పై మాణిక్యాలరావు విమర్శలు
- టీడీపీ పాలనలో అవినీతి జరిగితే విచారణ చేయొచ్చుగా
- ఈ ప్రభుత్వం తీరు దారుణంగా ఉంది
- తునిలో జర్నలిస్ట్ హత్య ఘటనే ఇందుకు నిదర్శనం
సీబీఐ న్యాయస్థానానికి ఒకసారి హాజరైతే తనకు అరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కనుక కోర్టుకు హాజరుకావడంపై తనకు మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ కోరడంపై ఆయన విమర్శలు చేశారు. ‘వారంలో రెండు సార్లు లోటస్ పాండ్ లో మీ ఇంటికి వెళుతుంటే మా డబ్బు కోటి ఇరవై లక్షల రూపాయలు గాలిలో కలిసిపోతోందన్న విషయాన్ని ఒక్కసారి మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జ్ఞప్తికి తెస్తున్నా’ అని అన్నారు.