ఖమ్మంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఒకరి మృతి

ఖమ్మం జిల్లాలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న బస్సు జిల్లాలోని కొణిజర్ల మండలం లక్ష్మీపురం వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఘటనా స్థలంలోనే ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Hyderabad
Khammam District
Road Accident

More Telugu News