సరిహద్దుల్లో అప్రమత్తత ప్రకటించిన భారత సైన్యం... ఆర్మీ చీఫ్ తో మాట్లాడిన రాజ్ నాథ్
- కాల్పుల ముసుగులో ఉగ్రవాదులను పంపేందుకు పాక్ యత్నం
- దీటుగా తిప్పికొట్టిన భారత సైన్యం
- 20 మంది పాక్ సైనికులు, ఉగ్రవాదులు హతం
అంతకుముందు,భారత భూభాగంలోకి ఉగ్రవాదులను పంపేందుకు పాకిస్థాన్ సైన్యం మరోసారి విఫలయత్నాలు చేయడం తెలిసిందే. భారత సైన్యం దృష్టి మళ్లించేందుకు పాక్ సైనికులు కాల్పులకు దిగారు. దాంతో భారత సైన్యం పాక్ పన్నాగాన్ని దీటుగా తిప్పికొట్టింది. ఈ దాడుల్లో పాక్ సైన్యం, ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్ లు ధ్వంసం కావడమే కాకుండా, 20 మంది వరకు పాక్ సైనికులు, ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు భారత జవాన్లు కూడా వీరమరణం పొందినట్టు తెలుస్తోంది.