వివాదంలో జోక్యం చేసుకున్నాడని ఆర్మీ జవాను హత్య : వరంగల్ జిల్లాలో దారుణం
- నర్సంపేట పట్టణంలో ప్రేమ్‌కుమార్‌పై దాడి
- పుట్టిన రోజు వేడుకలలో గొడవ
- సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన జవాను
ఈ సందర్భంలో ప్రేమ్‌కుమార్ జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఇది నచ్చని దూదిమెట్ల దిలీప్‌కుమార్, మరో ఇద్దరు ప్రేమ్‌కుమార్‌పై దాడికి దిగారు. కత్తులతో విచక్షణా రహితంగా పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే క్షతగాత్రుడిని స్థానిక ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.