మోడల్ తో ప్రేమాయణం... స్వగ్రామంలో దానధర్మాలు: ఘరానా దొంగ కేసులో నోరెళ్లబెడుతున్న పోలీసులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోడల్ తో ప్రేమాయణం... స్వగ్రామంలో దానధర్మాలు: ఘరానా దొంగ కేసులో నోరెళ్లబెడుతున్న పోలీసులు!

  • ముంబైలో పట్టుబడ్డ ఘరానా దొంగ ఇర్ఫాన్
  • ప్రియురాలితో కలిసి విదేశాల్లో చక్కర్లు
  • బెంజ్ కారులో వచ్చి చోరీ చేసి దర్జాగా వెళ్లిపోయే ఇర్ఫాన్
అతను సూటు, బూటు వేసుకుని, చూసేందుకు బాలీవుడ్ హీరో స్టయిల్ లో కనిపిస్తూ తిరిగే ఘరానా దొంగ. దొంగతనానికి వెళ్లాలన్నా కూడా బెంజ్ కారులోనే వెళతాడు. ఢిల్లీకి చెందిన ఓ మోడల్ తో ప్రేమాయణాన్ని సాగిస్తున్నాడు. దోచిన డబ్బులో కొంత మొత్తాన్ని పేదలకు ఖర్చు పెడతాడు కూడా. హైదరాబాద్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ దొంగగా ఉన్న ఇర్ఫాన్ (30) చరిత్ర ఇది. బడాబాబుల ఇళ్లే ఇతని టార్గెట్. తాజాగా ఇర్ఫాన్ ముంబైలో పట్టుబడగా, అతన్ని విచారిస్తున్న హైదరాబాద్ పోలీసులు, విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు.

ఢిల్లీలోని 12 మంది బడాబాబుల ఇళ్లలో తాను దొంగతనానికి పాల్పడినట్టు ఇర్ఫాన్ అంగీకరించడం గమనార్హం. ప్రియురాలితో కలిసి బ్యాంకాక్, ఇండొనేషియా దేశాల్లో పర్యటించి సరదాలు తీర్చుకునేందుకే దొంగతనాలు చేశాడీ ఘనుడు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్ పేటలోని ఇళ్లల్లో జరిగిన దొంగతనాల్లోనూ ఇతని ప్రమేయం ఉందని తేల్చారు. గతంలో ఎమ్మెల్యే కాలనీలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు, అక్కడి సీసీటీవీ ఫుటేజీల్లో బెంజ్ కారు కనిపించగా, దొంగ బెంజ్ కారులో ఎందుకు వస్తాడన్న ఆలోచనతో బంజారాహిల్స్  క్రైమ్ పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. అతను దొంగతనాలకు వెళ్లేటప్పుడు కూడా బెంజ్ కారులోనే వెళ్తున్నాడని తెలుసుకున్న పోలీసులు ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు.

తాను దొంగతనం చేసిన డబ్బులో కొంత మొత్తాన్ని బీహార్ లోని తన స్వగ్రామంలో పేద అమ్మాయిల పెళ్లిళ్లకు, వైద్య శిబిరాల నిర్వహణకు ఇర్ఫాన్ వెచ్చిస్తుండటం గమనార్హం. ఇర్ఫాన్ ను మరింత లోతుగా విచారిస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.
Irfan
Thief
Hyderabad
Police
Model

More Telugu News