సిగరెట్ తేవడానికి నిరాకరించిన స్నేహితుడు.. కత్తితో పొడిచిన యువకుడు
- సిగరెట్ విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ
- ఆగ్రహం పట్టలేక కత్తితో దాడి
- జనం పోగవడంతో నిందితుడి పరారీ
దీంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. అది మరింత పెద్దగా మారడంతో సలీం ఆగ్రహంతో ఊగిపోతూ కత్తితో సమీర్‌పై దాడిచేశాడు. భయపడిన సమీర్ అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఏం జరుగుతుందోనని జనం పోగవడంతో సలీం అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన సమీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న సలీం కోసం గాలిస్తున్నారు.