Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బతికున్న కొండచిలువను కాల్చేసి.. టిక్ టాక్ లో వీడియో పోస్ట్ చేసిన వైనం

  • గుజరాత్ లో ఘటన
  • నేరం రుజువైతే మూడు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష
  • నలుగురు నిందితులను పట్టుకునేందుకు గాలిస్తోన్న ఐదు బృందాలు
బతికున్న కొండచిలువను కొందరు కాల్చేసి పైశాచిక ఆనందాన్ని పొందిన ఘటన గుజరాత్ లోని బనస్కాంతా జిల్లాలోని బోదల్ గ్రామంలో చోటు చేసుకుంది. అంతేగాక, ఆ సమయంలో వీడియో తీసి సామాజిక మాధ్యమం టిక్ టాక్ లో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఘటన అధికారుల దృష్టికి వెళ్లడంతో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఆ వీడియోలోని సమాచారం ప్రకారం అటవీ శాఖ అధికారులు దీనిపై విచారణ ప్రారంభించారు.

ఆ వీడియోలో ఉన్న నలుగురిలోని ఇద్దరి వివరాలను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడానికి వారి ఇంటికి వెళ్లారు. అయితే, వారు వస్తున్నారన్న విషయాన్ని గుర్తించిన ఆ ఇద్దరు నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద వారిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వివరించారు. ఒకవేళ వారు చేసిన ఈ నేరం రుజువైతే వారికి మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.10,000 నుంచి రూ.25,000 మధ్య జరిమానా విధించే అవకాశం ఉందని చెప్పారు. నిందితులను అరెస్టు చేయడానికి అటవీ శాఖ ఐదు బృందాలను పంపింది.
python
Gujarath

More Telugu News