పద్మనాభాన్ని ఆ స్థితిలో చూడలేక ఆయన భార్య మరణించిందట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పద్మనాభాన్ని ఆ స్థితిలో చూడలేక ఆయన భార్య మరణించిందట!

  • పద్మనాభం అంచలంచెలుగా ఎదిగారు 
  •  అవకాశాలు కూడా తగ్గిపోయాయి
  •  ఆర్ధికంగా చితికిపోయారన్న ఈశ్వర్
రచయిత .. సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ మాట్లాడుతూ, హాస్యనటుడు పద్మనాభం గురించి ప్రస్తావించారు. "పద్మనాభం గారికి మొదటి నుంచి నాటకాల పిచ్చి ఎక్కువ. నటనపట్ల తనకి గల ఆసక్తి కారణంగానే అయన సినిమాల వైపుకు వచ్చారు.  హాస్యనటుడిగానే కాదు, దర్శక నిర్మాతగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు.

అలాంటి పద్మనాభం ఆర్ధిక పరిస్థితి దిగజారుతూ వచ్చింది. మరో వైపున అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో మళ్లీ ఊరూరా తిరుగుతూ ఆయన నాటకాలు వేయడం మొదలుపెట్టారు. తన రెండవ భార్య ప్రమీలా రాణి ఒక బుట్టలో ఆహార పదార్థాలు సర్దేసి ఇస్తే .. నాటకం పూర్తయిన తరువాత తినేసి ఇల్లు చేరుకునేవారు. ఒక వెలుగు వెలిగిన భర్త .. ఆ స్థితికి చేరుకోవడాన్ని చూడలేక ప్రమీలా రాణి మానసికంగా కుంగిపోయారు. ఆ కారణంగానే అనారోగ్యంపాలై మరణించారు. దాంతో పద్మనాభం గారు కూడా మానసికంగా చాలా దెబ్బతిన్నారు" అని చెప్పుకొచ్చారు.
Padmanabham

More Telugu News