భయంతో డబ్బిస్తుంటే.. వద్దంటూ వృద్ధురాలికి ముద్దిచ్చిన దొంగ.. ఆకట్టుకుంటున్న వీడియో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భయంతో డబ్బిస్తుంటే.. వద్దంటూ వృద్ధురాలికి ముద్దిచ్చిన దొంగ.. ఆకట్టుకుంటున్న వీడియో

  • బ్రెజిల్‌లోని ఓ ఫార్మసీ దుకాణంలో ఘటన
  • అందరి వద్దా డబ్బు కాజేసిన దొంగలు ఆమెను మాత్రం వదిలేశారు
  • సామాజిక మాద్యమాల్లో వీడియో వైరల్
దోపిడీకి వచ్చిన దొంగలు ఆ షాపులో అందరిపట్లా కఠినంగా వ్యవహరించి వారి వద్ద ఉన్నవి దోచుకున్నా, ఆ వృద్ధురాలిని మాత్రం వదిలేశారు. పైగా ఆమె సొత్తు ఇస్తుంటే ఓ దొంగ ఆమె నుదుటిపై ముద్దిచ్చాడు. షాపులోని సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ దృశ్యం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విశేషంగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

వివరాల్లోకి వెళితే...బ్రెజిల్‌ దేశంలోని అమరాంటేలో ఉన్న ఓ ఫార్మసీ షాపులోకి హెల్మెట్లు ధరించిన ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు. లోపల ఉన్న కస్టమర్లను తమ వద్ద వున్న తుపాకులతో బెదిరించారు. షాపు యజమానితోపాటు అందరి వద్ద ఉన్న డబ్బు ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేశారు.

కస్టమర్లంతా తమ వద్ద ఉన్న డబ్బు, ఇతర వస్తువులు తీసి వారికి ఇచ్చేశారు. ఈ క్రమంలో షాపులో ఉన్న ఓ వృద్ధురాలు కూడా తన వద్ద ఉన్న డబ్బును దొంగకు ఇవ్వబోయింది. కానీ ఆ దొంగ ఆ వృద్ధురాలి నుదుటిపై ముద్దుపెడుతూ 'మీరివ్వక్కర్లేదు మేడం, మీ డబ్బు మీ వద్దే ఉంచుకోండని' చెప్పి మిగిలిన వారి డబ్బుతో పరారయ్యారు. ఈ మొత్తం దృశ్యం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది.
brezil
thiefs
robery
old women

More Telugu News