Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • రష్మిక కోరుకునే మగాడు! 
  • అమెరికాలో విజయ్ సినిమా సందడి 
  • వరుణ్ తేజ్ తో శ్రీకాంత్ అడ్డాల?  
*  ఎదుటివాళ్లలో నిజాయతీని తాను బాగా ఇష్టపడతానని అంటోంది కథానాయిక రష్మిక. 'మనిషిలో గొప్ప లక్షణాలు లేకపోయినా ఇబ్బందిలేదు కానీ, నిజాయతీ మాత్రం కచ్చితంగా వుండాలి. అలాంటి కుర్రాడే భర్తగా రావాలని కోరుకుంటాను. నిజాయతీ అనేది మనిషికి చాలా ముఖ్యం' అని చెప్పింది రష్మిక.    
*  తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం 'బిజిల్' అమెరికాలో భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. అట్లీకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని అక్కడ 250 స్క్రీన్లపై విడుదల చేస్తున్నారు. 150 కోట్ల బడ్జెట్టుతో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో 'విజిల్' పేరిట అనువదించారు. ఈ నెల 25న రెండు భాషల్లోనూ ఇది విడుదలవుతోంది.
*  'బ్రహ్మోత్సవం' చిత్రం ఫ్లాపవడంతో వెనుకపడిపోయిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు వరుణ్ తేజ్ తో ఓ చిత్రం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. వరుణ్ ని గతంలో శ్రీకాంత్ 'ముకుంద' చిత్రంతో హీరోగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే.
Rashmika
Vijay
Varun Tej
Srikanth

More Telugu News