బోటు వెలికితీత పనుల్లో పురోగతి... రెయిలింగ్ ను బయటికి లాగిన ధర్మాడి సత్యం బృందం

  • కొనసాగుతున్న వెలికితీత పనులు
  • బోటు ఉన్న ప్రదేశాన్ని గుర్తించిన సత్యం బృందం
  • ఐరన్ రోప్ లతో బోటును చుట్టేందుకు ప్రయత్నం
గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును మరో రెండ్రోజుల్లో వెలికితీస్తామని ధర్మాడి సత్యం బృందం వెల్లడించింది. రెండో దఫా వెలికితీత కార్యక్రమాలు మొదలుపెట్టిన ధర్మాడి సత్యం బృందం తొలిసారిగా ఎంతో పురోగతి సాధించింది. సత్యం టీమ్ విసిరిన భారీ లంగరుకు బోటు రెయిలింగ్ చిక్కుకుని బయటికి వచ్చింది. దాంతో బోటు ఎక్కడ ఉందన్న విషయాన్ని ధర్మాడి సత్యం బృందం కచ్చితంగా నిర్ధారించినట్టు తెలుస్తోంది. అయితే, దాన్ని ఐరన్ రోప్ లతో చుట్టి వెలుపలికి లాగడానికి మరికొంత సమయం పట్టనుంది. తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద సెప్టెంబరు 15న బోటు మునిగిపోయిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Godavari
East Godavari District

More Telugu News