తప్పును ఎత్తి చూపించే వాళ్ల నోళ్లు నొక్కేయాలనుకోవడం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనం: చంద్రబాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తప్పును ఎత్తి చూపించే వాళ్ల నోళ్లు నొక్కేయాలనుకోవడం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనం: చంద్రబాబు

  • ట్విట్టర్ లో చంద్రబాబు వ్యాఖ్యలు
  • పాత్రికేయులపై దాడులను ప్రశ్నించిన వైనం
  • ఎందుకింత భయపడుతున్నారంటూ నిలదీసిన చంద్రబాబు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు. తప్పులను ఎత్తిచూపించే వాళ్ల నోళ్లు నొక్కేయాలనుకోవడం వైసీపీ సర్కారు పిరికితనానికి నిదర్శనం అని ట్వీట్ చేశారు. కొన్నిరోజులుగా రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతో పాటు వాక్ స్వాతంత్ర్యాన్ని కూడా కల్పించిందని, ఆ హక్కులను హరించడం అప్రజాస్వామికం అని మండిపడ్డారు. చేసే పనుల పట్ల చిత్తశుద్ధి, నమ్మకం ఉంటే ఎందుకింత భయపడుతున్నారని వైసీపీ సర్కారును నిలదీశారు. అంతేకాదు, ఎప్పట్లాగానే 'జగన్ ఫెయిల్డ్ సీఎం' అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు.
Chandrababu
Telugudesam
YSRCP
Jagan

More Telugu News