మన్మోహన్ సింగ్- రాజన్ హయాంలో బ్యాంకుల పరిస్థితి అధ్వానం: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మన్మోహన్ సింగ్- రాజన్ హయాంలో బ్యాంకుల పరిస్థితి అధ్వానం: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

  • ప్రభుత్వ రంగ బ్యాంకుల బలహీన పరిస్థితికి వీరే కారణం
  • 2013-14లో వసూలు కాని రుణాలు రూ.2.16 లక్షల కోట్లు 
  • మా ఆర్థిక విధానాలనా మన్మోహన్ విమర్శించేది?
యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వరంగ బ్యాంకుల పరిస్థితి అధ్వానంగా వుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా రఘురామ్ రాజన్ ఉన్న సమయంలో బ్యాంకుల పరిస్థితి దిగజారిందని అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల బలహీన పరిస్థితికి వీరిద్దరే కారణమని ఆమె చెప్పారు.

అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్ సదస్సులో నిర్మల పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ‘రాజన్ చెపుతున్న మాటలు, ఆయన భావనలను విశ్వసిస్తున్నా. ఆయనను గౌరవిస్తున్నా. ఈ రోజు నేను మీకు ఒక నిజం చెబుతున్నాను. ప్రధానిగా మన్మోహన్, ఆర్బీఐ గవర్నర్ గా రఘురామ్ రాజన్ ఉన్న సమయంలో ప్రభుత్వ బ్యాంకులు బలహీనంగా మారాయన్న దాంట్లో సందేహం లేదు. ఆ సమయంలో ఎవరూ కూడా ఈ విషయాన్ని గుర్తించలేకపోయారని పేర్కొన్నారు.

2014 నాటికి పీఎస్ బీ వసూలు కాని రుణాలు పెరిగాయి

2011-12 లో వసూలు కాని రుణాలు రూ.9,190 కోట్లు ఉండగా, 2013-14 నాటికి అవి రూ.2.16 లక్షల కోట్లకు పెరిగాయని ఆర్బీఐ పేర్కొందని నిర్మల పేర్కొన్నారు. ‘2014 మే నెలలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటికే పీఎస్ బీల పరిస్థితి దిగజారిన విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. దేశంలో ఆర్థిక వ్యవస్థ మందగమనంపై నేను విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ పలు రంగాల్లో ఉత్తేజం తెచ్చేందుకే కార్పొరేట్ టాక్స్ లో కోతను ప్రకటించాం. ఇది ద్రవ్య లోటును పెంచే ప్రమాదం ఉన్నప్పటికి ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజాన్ని అందించే లక్ష్యంగా నిర్ణయం అమలుకే మొగ్గు చూపాం’ అని వివరించారు.

యూపీఏ హయాంలో ఫోన్ చేస్తే రుణాలిచ్చారు


యూపీఏ తన హయాంలో రుణాలిచ్చే సమయంలో అనుసరించిన విధానాన్ని నిర్మల తూర్పారబట్టారు. రాజన్ హయాంలో కేవలం ఫోన్ కాల్స్ చేస్తేనే తమకు అనుకూలమైన ప్రభుత్వ బ్యాంకులకు, సంస్థలకు రుణాలు ఇచ్చేవారని నిర్మల శ్రోతల నవ్వుల మధ్య చెప్పారు. అప్పటి ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల ఏర్పడ్డ పరిస్థితి నుంచి బయటపడటానికి తాము ప్రభుత్వం ఈక్విటీలను నమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పారు.
Minister
Nirmala sitaraman
Manmohan singh
Rajan

More Telugu News