'రాజుగారి గది 3' విడుదలకి సిద్ధం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'రాజుగారి గది 3' విడుదలకి సిద్ధం

  • కామెడీతో కూడిన హారర్ థ్రిల్లర్ గా 'రాజుగారి గది 3' 
  • సెన్సారు కార్యక్రమాలు పూర్తి
  • ఈ నెల 18న భారీస్థాయి విడుదల
'రాజుగారి గది' టైటిల్ కింద ఓంకార్ వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఆయన తన తాజా చిత్రాన్ని 'రాజుగారి గది 3' టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అశ్విన్ బాబు కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో కథానాయికగా అవికా గోర్ కనిపించనుంది. ఈ నెల 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ను మంజూరు చేశారు. ఈ సినిమాలో హీరో అశ్విన్ బాబు .. హీరోయిన్ అవికా ఇద్దరూ కూడా దెయ్యాలు ఆవహించిన వారిలా కనిపిస్తూ ఉండటం విశేషం. అలీ .. అజయ్ ఘోష్ .. ఊర్వశి .. ధన్ రాజ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. 2 గంటల నిడివి కలిగిన ఈ సినిమా ఏ స్థాయిలో సందడి చేస్తుందో చూడాలి.
Ashwin Babu
Avika

More Telugu News