వైఎస్ వివేకా హత్య కేసుపై స్పందించిన ఏపీ డీజీపీ
- రాజకీయ నాయకుల మాటలను పట్టించుకోం
- మావోయిస్టు అరుణను అరెస్టు చేయలేదు
- పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల కార్యక్రమంలో డీజీపీ గౌతమ్ సవాంగ్
మావోయిస్టుల సమస్యపై డీజీపీ వ్యాఖ్యానిస్తూ.. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం తగ్గిపోయిందన్నారు. ప్రజలు కూడా వీరి సిద్ధాంతాల పట్ల విముఖత చూపుతున్నారన్నారు. ప్రజాస్వామ్యం ద్వారానే మార్పు వస్తుందని, హింస ద్వారా కాదని పేర్కొన్నారు. మావోయిస్టు నేత అరుణ పోలీసుల అదుపులో లేదని అన్నారు. ఆ మాటకొస్తే.. ప్రస్తుతం, పోలీసుల అదుపులో ఏ మావోయిస్టు కూడా లేరని డీజీపీ స్పష్టం చేశారు.