సెల్ఫీలకు వృద్ధ దంపతుల అద్భుత పోజులు.. అదుర్స్ అంటున్న నెటిజన్లు
- ప్రేమకు వయసుతో సంబంధం లేదనడానికి ఈ వృద్ధ దంపతులే సాక్ష్యం
- యువతకు ఏ మాత్రం తీసి పోకుండా పోజులు
- దుర్గా పూజల సందర్భంగా పశ్చిమ బెంగాల్ కు చెందిన దంపతుల సెల్ఫీలు
వారు సెల్ఫీలు తీసుకుంటున్న సమయంలో తీసిన ఫొటోలను అంజన్ అనే యువకుడు తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేయగా ఇవి వైరల్ అవుతున్నాయి. ఆ వృద్ధ దంపతుల మధ్య ఉన్న ప్రేమ, సంప్రదాయబద్ధమైన ఆహార్యం నెటిజన్లను అబ్బుర పరుస్తోంది. వీరి సెల్ఫీలు అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ దంపతులు పశ్చిమ బెంగాల్ కు చెందిన వారని, వారి కూతురు విదేశాల్లో నివసిస్తోందని తెలుస్తోంది.