సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • బుల్లితెరే ఇష్టమంటున్న కథానాయిక!
  • బాలయ్య సినిమాకు టైటిల్ అదేనా?
  • మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి త్రివిక్రమ్      
*  తనకు సినిమాల కన్నా బుల్లితెరపై నటించడమే ఇష్టమంటోంది కథానాయిక అవికా గోర్. 'కొంతమంది అడుగుతుంటారు.. మీకు తెలుగు సినిమాలు చేయడం ఇష్టమా? హిందీ సినిమాలు చేయడం ఇష్టమా? అని. అయితే నాకు మాత్రం టీవీలో నటించడమే ఇష్టమంటాను. ఎందుకంటే నేను అక్కడి నుంచే వచ్చాను, నాకు పేరు కూడా అక్కడే వచ్చింది' అని చెప్పింది.
*  నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రానికి 'జడ్జిమెంట్' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు. కథకు ఇది బాగా సరిపోతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఇదిలావుంచితే, ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల  కాకపోవచ్చని తెలుస్తోంది.
*  ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా థియేటర్ బిజినెస్ లోకి ప్రవేశిస్తున్నారు. రాజమహేంద్రవరంలోని ఓ మల్టీప్లెక్స్ ను ఆయన కొనుగోలు చేసినట్టు సమాచారం. పట్టణం నడిబొడ్డున ఈ థియేటర్ల సముదాయం వున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Avika
Balakrishna
K.S Ravikumar
Trivikram

More Telugu News