నాగశౌర్య హీరోగా కొత్త సినిమా ప్రారంభం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాగశౌర్య హీరోగా కొత్త సినిమా ప్రారంభం

  • 'ఛలో' తరువాత దక్కని హిట్ 
  • సొంత బ్యానర్లోను సినిమాలు 
  • సంతోష్ జాగర్లపూడితో సెట్స్ పైకి
'ఛలో' తరువాత నాగశౌర్య కథానాయకుడిగా చేసిన సినిమాలేవీ అంతగా ఆడలేదు. దాంతో కథల ఎంపిక విషయంలో  ఆయన మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. కొన్ని సినిమాలు సొంత బ్యానర్ పై సెట్ చేసుకుని, మరికొన్ని సినిమాలు వేరే బ్యానర్లలో చేస్తున్నాడు.

అలా బయటివారికి ఆయన చేస్తున్న సినిమా, కొంతసేపటి క్రితం పూజా కార్యక్రమాలను జరుపుకుంది. నాగశౌర్య హీరోగా నారాయణ దాస్ నారంగ్ .. శరత్ మరార్ .. రామ్మోహన్ రావ్ ఒక సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. దిల్ రాజు కెమెరా స్విచ్చాన్ చేయడంతో .. అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వడంతో లాంఛనంగా ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.
Nagashaurya

More Telugu News