కోడెల కుటుంబసభ్యుల స్టేట్ మెంట్లు రికార్డు చేసిన తెలంగాణ పోలీసులు!
- గుంటూరు వెళ్లిన బంజారాహిల్స్ పోలీసులు
- కోడెల భార్య, కొడుకు శివరామ్ స్టేట్ మెంట్ల నమోదు
- ఒత్తిడి కారణంగానే తన తండ్రి మృతి చెందారన్న శివరామ్
తన తండ్రి మృతి చెందడానికి ముందే తాను విదేశాలకు వెళ్లానని, ఆయన మృతి వార్త తన కుటుంబసభ్యులు చెబితేనే తెలిసిందని పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో శివరామ్ పేర్కొన్నట్టు తెలిసింది. తన భర్త ఎప్పుడూ దేనికీ భయపడే వ్యక్తి కాదని, పోలీస్ కేసులతో తన భర్తను ఇబ్బంది పెట్టారని పోలీసులకు కోడెల భార్య చెప్పినట్టు సమాచారం.