దసరాకు మొదలైన సెలవులు సంక్రాంతి వరకు కొనసాగుతాయేమో!: కేసీఆర్ సర్కారుపై విజయశాంతి సెటైర్
- తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
- కేసీఆర్ పై విమర్శలు చేసిన విజయశాంతి
- ప్రజల ప్రాణత్యాగాలను స్వార్థం కోసం వాడుకుంటాడని వ్యాఖ్యలు
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పైనా విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీకాంతాచారి తరహాలో ఆత్మత్యాగానికి పాల్పడితే ప్రభుత్వం దిగొస్తుందని ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి బలవన్మరణానికి పాల్పడడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రజల ప్రాణత్యాగాలను తన స్వార్థం కోసం వాడుకోవడం కేసీఆర్ దొరగారికి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఇలాంటి ప్రాణత్యాగాలు చూసి చలించే మనస్తత్వం కేసీఆర్ ది కాదని పేర్కొన్నారు. ఏదైనా బతికి సాధించాలని, కేసీఆర్ దొరతనానికి అంతం చూడాలంటే అదే మార్గమని తెలిపారు.