సీఎం కేసీఆర్ కు ‘మేఘా’ కృష్ణారెడ్డి ప్రయోజనాలే తెలుసు!: ప్రొఫెసర్ కోదండరామ్
- తెలంగాణ రాకముందే ఆర్టీసీ విలీనం ప్రక్రియ మొదలైంది
- ప్రజా ప్రయోజనాలు కేసీఆర్ కు తెలియవు
- టీఎస్సార్టీసీని ప్రభుత్వమే నాశనం చేసింది
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆర్టీసీని బ్రహ్మాండంగా నడుపుకుంటామని నాడు కేసీఆర్ అన్న మాటలను ఈ సందర్భంగా కోదండరామ్ గుర్తుచేశారు. మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలపై ఆయన విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ కు మేఘా కృష్ణారెడ్డి ప్రయోజనాలు తెలుసుగానీ, ప్రజా ప్రయోజనాలు తెలియవని అన్నారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురించి ఆయన ప్రస్తావించారు. రాష్ట్రానికి పట్టిన పీడను మనం వదిలించాలే తప్ప, ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని కోరారు. ఎవరూ అధైర్యపడొద్దని, ధైర్యంగా నిలబడాలని, ఎక్కడా ఆత్మహత్యల జరగకూడదని అన్నారు.