సంక్రాంతి పోటీకి తానూ రెడీ అంటున్న మహేశ్ బాబు... జనవరి 12న 'సరిలేరు నీకెవ్వరు' రిలీజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సంక్రాంతి పోటీకి తానూ రెడీ అంటున్న మహేశ్ బాబు... జనవరి 12న 'సరిలేరు నీకెవ్వరు' రిలీజ్

  • జనవరి 12న రానున్న బన్నీ 'అల వైకుంఠపురములో' చిత్రం
  • అదే రోజున తన చిత్రం రిలీజ్ చేయాలని మహేశ్ బాబు ప్లాన్
  • గతంలోనూ ఈ ఇద్దరి చిత్రాల మధ్య క్లాష్
టాలీవుడ్ అగ్రహీరోలు మహేశ్ బాబు, అల్లు అర్జున్ ఈసారి సంక్రాంతి బరిలో అమీతుమీకి సిద్ధమవుతున్నారు. అల్లు అర్జున్ తన అల వైకుంఠపురములో చిత్రం రిలీజ్ డేట్ ను కొద్దిసేపటి క్రితమే ప్రకటించగా, ఆ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే మహేశ్ బాబు కూడా తన సరిలేరు  నీకెవ్వరు చిత్రం విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ లో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే బిజినెస్ రీత్యా ఇద్దరు అగ్రహీరోల సినిమాలు ఒకే రోజున రిలీజైతే ఎంతటి ప్రభావం చూపిస్తుందో సినిమా కొన్నవాళ్లకు బాగా తెలుసు!

గతంలోనూ మహేశ్ బాబు, అల్లు అర్జున్ మధ్య బాక్సాఫీస్ వార్ కొద్దిలో మిస్సయింది. కొన్నాళ్ల కిందట భరత్ అనే నేను, నా పేరు సూర్య చిత్రాలు ఒకే రోజున రిలీజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. అయితే చర్చల అనంతరం మహేశ్ చిత్రం ముందు రిలీజ్ కాగా, బన్నీ చిత్రం ఆ తర్వాత వచ్చింది. మరి ఈసారి ఏం జరుగుతుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేశ్ బాబు ఆర్మీ మేజర్ పాత్ర పోషిస్తున్నారు. విజయశాంతి చాన్నాళ్ల తర్వాత ఓ కీలకపాత్రలో కనిపిస్తున్న ఈ మూవీలో మహేశ్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. యువ దర్శకుడు అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు చిత్రానికి డైరెక్టర్.
Allu Arjun
Mahesh Babu
Tollywood

More Telugu News