మా హయాంలో మేము ఇలాగే ప్రవర్తించి ఉంటే జగన్ తిరిగి ఉండేవారా?: నిమ్మకాయల చినరాజప్ప
- ఇసుక కొరతను నిరసించే దీక్షను భగ్నం చేస్తారా!
- కార్మికులకు పనులు లేక వీధినపడుతున్నారు
- సీఎం జగన్ స్పందించరే!
ఈ సందర్భంగా పోలీసులపై ఆయన విమర్శలు గుప్పించారు. పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. తమ ప్రభుత్వం హయాంలో తాము ఇలాగే వ్యవహరించి ఉంటే జగన్ తిరిగి ఉండేవారా? అని ప్రశ్నించారు. కచ్చులూరు బోటు మునిగిన ఘటనపై ఆయన స్పందిస్తూ, ఈ ప్రమాదం జరిగి ఇన్నిరోజులు గడుస్తున్నా బోటును వెలికితీయలేకపోయారని విమర్శించారు.