సీఎం జగన్ సభ కోసం పేదల ఇళ్లు కూలగొడతారా!: బుద్ధా వెంకన్న

  • పేదల జీవితాల్లో చీకటి నింపారు
  • చంద్రబాబు హయాంలో ‘ఐ’ కేంద్రాలు ప్రారంభించాం
  • ఆ కేంద్రాలకు వైఎస్ పేరు పెట్టి ‘కంటి వెలుగు’ అంటారా?
అనంతపురం వేదికగా ‘కంటి వెలుగు’ పథకాన్ని సీఎం జగన్ ఈరోజు ప్రారంభించడం, అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించడం తెలిసిందే. అయితే, సభా వేదిక దగ్గర ఉన్న పేదల గుడిసెలను కూలగొట్టి ఈ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు.

 ‘ముందు నీ కళ్ళు బాగుచేయించుకో శకుని మామా!’ అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సెటైర్లు విసురుతూ ఓ ట్వీట్ చేశారు. చంద్రబాబు హయాంలో ప్రారంభించిన ‘ఐ’ కేంద్రాలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టి ‘కంటి వెలుగు’ అని ప్రారంభోత్సవం చేయడానికి సభా ఏర్పాట్ల కోసం యాభై ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న పేదల ఇళ్లు కూలగొట్టారని, వాళ్ళ జీవితాల్లో చీకటి నింపారు అని విమర్శించారు.
Go Back to Shorts
Ananthapuram
cm
jagan
Telugudesam
budda

More Telugu News