'బిగ్ బాస్'ను బ్యాన్ చేయవలసిందే: కర్ణిసేన డిమాండ్
- ఆది నుంచి విమర్శలను ఎదుర్కొంటున్న 'బిగ్ బాస్'
- ప్రస్తుతం నడుస్తున్నది 13వ సీజన్
- షోను ఆపేయాలంటూ 'కర్ణిసేన' డిమాండ్
కుటుంబ సభ్యులతో కలిసి చూడలేని విధంగా వున్న ఈ రియాలిటీ షోను వెంటనే బ్యాన్ చేయాలంటూ,కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ కి 'కర్ణిసేన' ప్రతినిధులు ఒక లేఖను సమర్పించారు. జాతీయ మీడియా వేదికగా హిందూ సంప్రదాయాలను అవహేళన చేస్తోన్న ఈ షోను తక్షణమే నిలిపివేయాలంటూ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కి కూడా వారు ఒక లేఖను అందజేశారు.