'కంటి వెలుగు'ని ప్రారంభించిన జగన్.. తొలి రెండు దశల్లో 70 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు
- అనంతపురంలో కంటి వెలుగును ప్రారంభించిన ముఖ్యమంత్రి
- తొలి రెండు దశల్లో 70 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు
- జనవరి 1 నుంచి అందరికీ అందుబాటులోకి రానున్న ప్రభుత్వం
కంటి వెలుగు పథకం కింద మూడేళ్ల పాటు ఆరు విడతలుగా రాష్ట్రంలోని ప్రజలందరికీ అవసరమైన నేత్ర పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నారు. ఈ రోజు నుంచి 16వ తేదీ వరకు తొలి దశ పరీక్షలను నిర్వహిస్తారు. తొలి దశలో దాదాపు 70 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలను నిర్వహించనున్నారు. రెండో దశలో నవంబర్ 1 నుంచి 31 వరకు కంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారిని విజన్ సెంటర్లకు పంపించి అవసరమైన చికిత్సలను నిర్వహిస్తారు. క్యాటరాక్ట్ ఆపరేషన్లు, కళ్లద్దాలను, ఇతర సేవలను ఉచితంగా అందిస్తారు. జనవరి 1 నుంచి ఈ పథకం అందరికీ అందుబాటులోకి వస్తుంది.