రచ్చకెక్కిన నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు.. జగన్ సీరియస్
- కోటంరెడ్డి, కాకాని మధ్య తీవ్ర స్థాయికి చేరిన వర్గ విభేదాలు
- ఎంపీడీఓ సరళ వ్యవహారం తర్వాత మరింత ముదిరిన విభేదాలు
- అమరావతికి రావాలంటూ జగన్ ఆదేశం
ఈ నేపథ్యంలో, ఈ ఇద్దరు ఎమ్మెల్యేల తీరుపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. ఇద్దరినీ రాజధానికి రావాలని ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఇరువురు నేతలతో జగన్ నేరుగా మాట్లాడనున్నారు. మరోవైపు, ఇరువురు ఎమ్మెల్యేల మధ్య విభేదాలకు రియలెస్టేట్ వ్యవహారాలే కారణమని భావిస్తున్నారు.