టర్కీకి మద్దతిస్తూ.. సిరియా నుంచి వెనక్కి మళ్లిన అమెరికా బలగాలు!
- సరిహద్దుల వెంబడి అమెరికా సైన్యం
- ఉగ్రవాదులపై దాడులకు టర్కీ సైన్యం సన్నద్ధం
- ఈ మేరకు వైట్ హౌస్ ప్రకటన
ఉగ్రవాదులపై సైనిక అపరేషన్ చేపట్టాలన్న టర్కీ అధ్యక్షుడి నిర్ణయానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే మద్దతు పలికారు. ఉగ్రవాదులను టర్కీ దీటుగా ఎదుర్కొనేందుకు తమవంతు సహకారాన్ని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. టర్కీ దీర్ఘకాలిక ప్రణాళికకు అమెరికా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు వైట్ హౌస్ ఓ ప్రకటన వెలువరించింది. అయితే, టర్కీ జరిపే సైనిక దాడుల్లో అమెరికా సైన్యం మాత్రం పాల్గొనబోదని స్పష్టం చేసింది.