మరింత ఉద్ధృతమైన తెలంగాణ ఆర్టీసీ సమ్మె.. ఐదో రోజూ డిపోలకే పరిమితమైన బస్సులు

  • వెనక్కి తగ్గేది లేదన్న ఆర్టీసీ కార్మికులు
  • ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన నేడు అఖిలపక్ష సమావేశం
  • హాజరుకానున్న విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు
26 డిమాండ్లతో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఐదో రోజూ కొనసాగుతోంది. నేడు కూడా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం ససేమిరా అనగా, మరోవైపు సమ్మెను మరింత ఉద్ధృతం చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి.

ఆర్టీసీ కార్మికుల భవిష్యత్‌పై నేడు టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల భవితవ్యం, భవిష్యత్ పోరాటంపై చర్చించనున్నారు. మరోవైపు, ఐదో రోజు కూడా బస్సులు రోడ్డెక్కకపోవడంతో ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలిక సిబ్బందితో పాక్షికంగా బస్సులు నడుపుతోంది.
Go Back to Shorts
Telangana
RTC strike
Kodandaram
KCR

More Telugu News