జహీర్ ఖాన్ పై ట్వీట్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురైన హార్దిక్ పాండ్య
- జహీర్ కి బర్త్ డే విషెస్ తెలిపిన హార్దిక్ పాండ్య
- జహీర్ బంతికి తాను సిక్స్ కొట్టిన వీడియో ట్వీట్ చేసిన పాండ్య
- నెటిజన్ల ట్రోలింగ్
"నువ్వు టీవీ షోలో ఎలాంటి వ్యాఖ్యలు చేశావో జహీర్ కూడా ఆ విధంగా కామెంట్ చేయాలని కోరుకుంటున్నావా?" అని ఎత్తిపొడిచారు. "జహీర్ ఓ మైనారిటీ కాబట్టి ఈ విధంగా మాట్లాడగలిగావు, అదే ధోనీ, రోహిత్ లను ఈ విధంగా మాట్లాడే దమ్ము నీకుందా? వాళ్లు నిన్ను కొడితే పాత రోజుల్లోకి వెళ్లి పడతావు జాగ్రత్త!" అంటూ మరో నెటిజన్ హెచ్చరించాడు.
"బ్రెట్ లీ, షోయబ్ అక్తర్ వంటి బౌలర్లనే ఉతికారేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 53 సిక్సులు కొట్టాడు. తాను ఊపుమీదున్న రోజుల్లో అయితే ఓ ఇన్ స్వింగింగ్ యార్కర్ తో నీ కాలి బొటనవేలిని ఛిద్రం చేసేవాడు" అంటూ మరో క్రికెట్ అభిమాని మండిపడ్డాడు. "డబ్బు, పేరుప్రఖ్యాతులున్నంత మాత్రాన మంచి వ్యక్తి కాలేరు అనడానికి హార్దిక్ పాండ్యనే నిదర్శనం" అని మరో నెటిజన్ స్పందించాడు.