Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తన ఎగ్జయిట్ మెంట్ అందరికీ తెలియాలన్న త్రివిక్రమ్... "సూపర్" అంటూ చిరంజీవి రెస్పాన్స్

  • చిరంజీవి, రామ్ చరణ్ లను ఇంటర్వ్యూ చేసిన త్రివిక్రమ్
  • షూటింగ్ పక్కనబెట్టి సైరా చూశానన్న త్రివిక్రమ్
  • చిరంజీవి ప్రశ్నకు వివరణ
సైరా విజయోత్సవ సంబరాల్లో మునిగితేలుతున్న చిరంజీవి, రామ్ చరణ్ లను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, మమ్మల్ని ఎందుకు ఇంటర్వ్యూ చేయాలనుకున్నారు? అంటూ అడగ్గా, త్రివిక్రమ్ వివరణ ఇచ్చారు.

"షూటింగ్ కు విరామం ఇచ్చి సైరా చిత్రాన్ని ఫస్ట్ డే చూశాను. అయితే సినిమాపై నా అభిప్రాయాన్ని వెంటనే మీకు చెప్పలేదు. అందుకు కారణం ఉంది. సైరా వీక్షించిన మిగతా వారి ఆనందాన్ని కూడా తెలుసుకుని అప్పుడు మీతో పంచుకోవాలని ఇదిగో ఇలా మీ ముందుకు వచ్చాను. నా ఉద్విగ్నత ఎలా ఉందో అందరికీ తెలియాలి" అని వెల్లడించారు. దీనికి చిరంజీవి స్పందిస్తూ "సూపర్" అంటూ ప్రశంసించారు.
Trivikram
Chiranjeevi
Ramcharan

More Telugu News