యురేనియం తవ్వకాల ప్రాంతాలలో గర్భిణులకు గర్భస్రావాలు జరుగుతున్నాయి: జగన్ కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ
- యురేనియం తవ్వకాలను వెంటనే ఆపేయాలి
- ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు
- తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాల్లో రచ్చబండ నిర్వహించాలి
ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. యురేనియం తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాల్లో అఖిలపక్ష బృందం పర్యటించిందని లేఖలో తెలిపారు. ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని... గర్భిణులకు గర్భస్రావాలు కూడా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణానికి పెను ప్రమాదంగా పరిణమించిన యురేనియం తవ్వకాలను తక్షణమే ఆపాలని విన్నవించారు.