కొణతాల మనసులో ఏముంది?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొణతాల మనసులో ఏముంది?

సీనియర్ నేత దాడి వీరభద్రరావు వైఎస్సార్సీపీలో చేరడంతో కొణతాల వర్గం అసమ్మతి రాగం ఆలపిస్తోన్న సంగతి తెలిసిందే. దాడి, కొణతాల ఎవరికివారు కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ మాటల యుద్ధాలకు తెరదీయడంతో, అనకాపల్లి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాగా, పార్టీలో దాడి చేరిన నాటి నుంచి కొణతాల రామకృష్ణ వైఎస్సార్సీపీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.

మొన్నటికిమొన్న ఓ కీలక సమావేశానికి గైర్హాజరైన ఆయన, తాజాగా పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి కూడా డుమ్మా కొట్టారు. ముఖ్యంగా.. వైఎస్ షర్మిల పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సభలోనూ కొణతాల కనిపించలేదు. ఒకసారి ముఖ్యుల వివాహం ఉందని, మరోసారి ఆరోగ్యం బాగాలేదని కొణతాల చెబుతున్నారని పార్టీ వర్గాలంటున్నాయి. దీంతో, ఆయన పార్టీని వీడతారన్న ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.

More Telugu News