బస్సులో తుపాకితో కాల్చుకుని 'టిక్ టాక్' విలన్ ఆత్మహత్య
- సోషల్ మీడియాలో భయపెట్టే పోస్టులు
- మూడు హత్య కేసుల్లో నిందితుడు
- పోలీసులు పట్టుకునేందుకు వస్తుండడంతో ఆత్మహత్య
స్థానిక బీజేపీ నేత కుమారుడు, అతని మేనల్లుడిని హత్య చేసిన కేసులో అశ్వినీ కుమార్ నిందితుడు. అతడి తలపై లక్ష రూపాయల రివార్డు కూడా ఉంది. అలాగే, తన మాట విననందుకు ఓ యువతిని చంపేశాడు. వారం రోజులుగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీంతో భయపడిన అశ్వినీకుమార్ ఢిల్లీ పారిపోయేందుకు బస్సెక్కాడు. అతడెక్కిన బస్సును పోలీసులు తనిఖీ చేయటానికి ఆపడంతో భయపడి తుపాకితో కాల్చుకుని చనిపోయాడు.