నాకు ఇరవై ఏళ్ల వయసులో ఓ కొంటె పని చేశాను: నటి మంచు లక్ష్మి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకు ఇరవై ఏళ్ల వయసులో ఓ కొంటె పని చేశాను: నటి మంచు లక్ష్మి

  • రెస్టారెంట్ లో ఫుడ్ తిని బిల్లు కట్టకుండా వచ్చాను
  • మొన్న చెన్నైలోని ఓ రెస్టారెంట్ లోనూ అదే పని చేశా
  • చాలా ఆర్డర్ చేశాం..గ్రీన్ టీకే బిల్లు కట్టాం
తనకు ఇరవై ఏళ్ల వయసు ఉన్నప్పుడు చేసిన ఓ కొంటె పని గురించి ప్రముఖ నటి మంచు లక్ష్మి ప్రస్తావించింది. ‘టీవీ 9’కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, రెస్టారెంట్ లో ఫుడ్ తిని బిల్లు కట్టకుండా వచ్చానని చెప్పింది. మొన్న కూడా చెన్నైలోని ఓ రెస్టారెంట్ లో ఫుడ్ తిని బిల్లు కట్టలేదు, ఆ రెస్టారెంట్ పేరు మాత్రం చెప్పను అని పేర్కొంది. ‘నా ఫ్రెండ్, ఇంకో అమ్మాయి వెళ్లాం. చాలా ఆర్డర్ ఇచ్చాం. వెళ్లిపోయే ముందు గ్రీన్ టీ ఆర్డర్ ఇచ్చాం. అతను వేరే ఆర్డర్ తీసుకున్నాడు. ‘బిల్లు’ అని అడిగితే గ్రీన్ టీకు వచ్చింది’ అని, గ్రీన్ టీకి డబ్బులు కట్టి వెళ్లిపోతుంటే తన ఫ్రెండ్ వద్దని అడ్డుపడిందని గుర్తుచేసుకుంది. ఆ తర్వాత అసలు బిల్లు కట్టేద్దామనుకుని వెళితే.. ‘‘ఏం ఆర్డర్ ఇచ్చారు మేడమ్’ అని నన్ను అడిగాడు వాడు. ‘నేను ఆర్డర్ ఇచ్చాను.. మళ్లీ నీకు చెప్పాలా!.. అసలు కట్టను పోరా’ అని వాడి మొహం మీదే చెప్పి నడిచి వచ్చేశాను’ అని గుర్తుచేసుకుంటూ నవ్వులు చిందించింది. 
Artist
Manchu
Lakshmi
chennai
Naughty thing

More Telugu News