ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ తీపి కబురు : 150 దసరా స్పెషల్స్
- హైదరాబాద్ నుంచి అత్యధికంగా 110 బస్సులు
- తెలంగాణ సమ్మె నేపథ్యంలో ఇది ఎంతో ఊరట
- మిగిలిన సర్వీసులు బెంగళూరు, చెన్నై నుంచి
రద్దీకి అనుగుణంగా మరిన్ని అదనపు సర్వీసులు కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. హైదరాబాద్ మహానగరంలో ఏపీ నుంచి వెళ్లి స్థిరపడిన వారు అత్యధికం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లా వాసులు ఎక్కువ మంది ఉన్నారు. సాధారణంగా వీరంతా దసరా, సంక్రాంతి పండుగకు సొంతూరుకు రావాలని ప్లాన్ చేసుకుంటారు.
అయితే ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తుండడంతో అక్కడి నుంచి సర్వీసులు పూర్తిగా నిలిచి పోయాయి. దీంతో సొంతూర్లకు ఎలా చేరాలా? అని సతమతమవుతున్న వారికి ఇది తీపి కబురనే చెప్పాలి.