తండ్రి లేని బాధను ఇలా తీర్చుకుంది.. చితాభస్మాన్ని గోళ్లలో ఉంచుకుని పెళ్లాడిన యువతి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తండ్రి లేని బాధను ఇలా తీర్చుకుంది.. చితాభస్మాన్ని గోళ్లలో ఉంచుకుని పెళ్లాడిన యువతి!

  • కేన్సర్ బారిన పడి మరణించిన తండ్రి
  • కుమార్తె  పెళ్లి చూడాలని ఆరాటం
  • నెయిల్ ఆర్టిస్ట్ ద్వారా చితాభస్మాన్ని గోళ్లలో పెట్టుకుని పెళ్లి
కుమార్తె పెళ్లి చూడాలని ఆశ పడిన ఓ తండ్రి కేన్సర్ బారిన పడి నాలుగు నెలల క్రితం మరణించాడు. తన పెళ్లి చూడకుండానే తండ్రి మరణించాడన్న ఆవేదన కుమార్తెను కుంగదీసింది. మరోవైపు పెళ్లికి సమయం దగ్గరపడుతోంది. ఆమె బాధను అర్థం చేసుకున్న సమీప బంధువు అద్భుతమైన ఆలోచనతో ఆమె పెళ్లి జరిపించాడు.

లండన్‌కు చెందిన చార్లెట్ వాట్సన్ తండ్రి మిక్ బార్బర్ నాలుగు నెలల క్రితమే మృతి చెందాడు. అయితే, తన పెళ్లి చూడాలని తండ్రి ఆరాటపడేవాడని ఆమె తన బంధువైన నెయిల్ ఆర్టిస్ట్ క్రిస్టీ మీకిన్‌కు తెలిపింది. దీంతో అతడు ఆమె తండ్రి చితాభస్మాన్ని గోళ్లలో ఉంచి వాటిని అందంగా తీర్చిదిద్ది వివాహం జరిపించాడు. తండ్రి భౌతికంగా తన వద్ద లేకపోయినా చితాభస్మాన్ని గోళ్లలో పెట్టుకోవడం ద్వారా తన పెళ్లిని చూపించానని చార్లెట్ మురిసిపోయింది. తండ్రి చితాభస్మాన్ని తన పెండెంట్‌లోనూ పెట్టుకున్నట్టు తెలిపింది.
London
marriage
nail artist

More Telugu News