చంద్రయాన్-2 నుంచి మరికొన్ని చిత్రాలు.. ఫొటోల్లో భారీ బిలాలు, బండరాళ్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రయాన్-2 నుంచి మరికొన్ని చిత్రాలు.. ఫొటోల్లో భారీ బిలాలు, బండరాళ్లు

  • ఫొటోలు తీసిన ఆర్బిటర్‌లోని హైరిజల్యూషన్ కెమెరా
  • వంద మీటర్ల దూరం నుంచి ఫొటోలు
  • దక్షిణ ధ్రువ ప్రాంతంలో మరో వారం రోజుల్లో పూర్తిగా వెలుతురు
చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన మరికొన్ని ఫొటోలను చంద్రయాన్-2 ఆర్బిటర్ పంపింది. చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్న ఆర్బిటర్‌లోని హై రిజల్యూషన్ కెమెరా (ఓహెచ్ఆర్‌సీ) తీసిన ఈ ఫొటోల్లో భారీ బిలాలు, బండరాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శనివారం తెల్లవారుజామున 4:38 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంలోని బోగస్లాస్కై బిలం పరిసరాలను వంద మీటర్ల దూరం నుంచి ఆర్బిటర్ ఫొటోలు తీసినట్టు ఇస్రో పేర్కొంది.

ఫొటోల్లో కనిపిస్తున్న బండరాళ్ల ఎత్తు రెండు మీటర్లు ఉండగా, బిలాలు ఐదు మీటర్ల నుంచి 14 కిలోమీటర్ల వృత్తాకారంలో ఉన్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఇప్పటికే సూర్య కిరణాలు ప్రసరిస్తున్నాయని, మరో వారం రోజుల్లో పూర్తిగా వెలుతురు వస్తుందని పేర్కొన్నారు.
chandrayaan-2
orbiter
lunar
photos

More Telugu News