ఇస్రో శాస్త్రవేత్తగా నమ్మించి వివాహం.. అమెరికా వెళ్తున్నట్టు చెప్పి గురుగ్రామ్‌లో మకాం!

  • నాసా వ్యోమగామి ప్రాజెక్టు కోసం అమెరికా పయనం
  • ట్రాక్ లొకేషన్‌లో గురుగ్రామ్‌లో ఉన్నట్టు తేలడంతో విస్తుపోయిన భార్య
  • నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
ఇస్రో శాస్త్రవేత్తనని చెప్పి ఓ యువతిని పెళ్లాడిన ప్రబుద్ధుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం.. ద్వారకానగర్‌కు చెందిన జితేంద్ర ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నట్టు నమ్మించి పీహెచ్‌డీ అమ్మాయిని ఈ ఏడాది మే నెలలో పెళ్లాడాడు. నాసా చేపట్టిన వ్యోమగామి మిషన్‌ కోసం అమెరికా వెళ్తున్నట్టు ఇటీవల భార్యతో చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

అతడి వ్యవహారంపై అనుమానం వచ్చిన భార్య మొబైల్ ద్వారా అతడు ఎక్కడున్నదీ ట్రాక్ చేసి చూసి విస్తుపోయింది. అతడు గురుగ్రామ్‌లో ఉన్నట్టు ట్రాక్ లొకేషన్‌లో కనిపించడంతో షాకైంది. దీంతో తాను మోసపోయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
isro
New Delhi
marriage
scientist

More Telugu News