లలిత జ్యువెలర్స్ చోరీ కేసులో దొంగ అరెస్ట్.. 4.5 కిలోల బంగారు నగలు స్వాధీనం
- నగలతో బైక్పై వస్తూ పోలీసులకు చిక్కిన దొంగ
- నిందితులు ఇద్దరూ ఒకే గ్రామం వారే
- పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు
నిందితుడిని తిరువారూర్కు చెందిన మణికంఠన్ (32)గా గుర్తించారు. పరారీలో ఉన్న మరో దొంగ కూడా అదే గ్రామానికి చెందిన సురేశ్ అని పోలీసులు తెలిపారు. చోరీ అనంతరం నిందితులు ఇద్దరూ నగలను పంచుకున్నట్టు పోలీసులు తెలిపారు. తిరుచ్చిలోని లలిత జ్యువెలర్స్ షోరూంలో బుధవారం తెల్లవారుజామున భారీ దొంగతనం జరిగింది. గోడకు కన్నం వేసి షోరూంలోకి చొరబడిన ఇద్దరు యువకులు ముఖాలకు మాస్క్ వేసుకుని నగలను దోచేశారు. మొత్తం రూ.13 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు.