చిరంజీవి 'సైరా' చిత్రంపై నారా లోకేశ్ ప్రశంసల వర్షం
- 'సైరా' చిత్రాన్ని వీక్షించిన నారా లోకేశ్
- ట్విట్టర్ లో స్పందన
- చిరంజీవి గారికి హ్యాట్సాఫ్ అంటూ వ్యాఖ్యలు
'సైరా' సినిమా చిరంజీవి 12 ఏళ్ల కలకు ప్రతిరూపం అని, ఆయన తన స్వప్నాన్ని అద్భుతమైన రీతిలో సాకారం చేసుకున్నారని లోకేశ్ కితాబిచ్చారు. అంతేకాదు, చిరంజీవికి హ్యాట్సాఫ్ చెప్పారు. చిత్రయూనిట్ కు తన అభినందనలు తెలియజేశారు. ఎంతో కష్టపడి, 'సైరా' చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని, ఘనవిజయాన్ని అందుకున్న నిర్మాత రామ్ చరణ్ కు, దర్శకుడు సురేందర్ రెడ్డికి, ఇతర టెక్నీషియన్లు, యూనిట్ సభ్యులకు హార్దికాభినందనలు అంటూ ట్వీట్ చేశారు.