హెల్త్‌కేర్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్‌తో సినీ నటి అర్చన నిశ్చితార్థం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హెల్త్‌కేర్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్‌తో సినీ నటి అర్చన నిశ్చితార్థం

  • వ్యాపారవేత్త జగదీశ్‌తో గత కొంతకాలంగా ప్రేమాయణం
  • గత నెలలోనే ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోను పోస్టు చేసిన నటి
  • 2004లో ‘నేను’ సినిమాతో చిత్రసీమలోకి
ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్‌ జగదీశ్‌తో టాలీవుడ్ నటి అర్చన (వేద) నిశ్చితార్థం నిన్న ఘనంగా జరిగింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో జరిగిన నిశ్చితార్థ కార్యక్రమానికి నటులు నవదీప్, శివబాలాజీ, సుమంత్, నటి మధుమిత తదితరులతోపాటు ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, స్నేహితులు హాజరయ్యారు.

అర్చన-జగదీశ్‌లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. గత నెలలోనే ప్రియుడు జగదీశ్‌తో కలిసి దిగిన ఫొటోను అర్చన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. త్వరలోనే శుభవార్త వింటారని పేర్కొంది. 2004లో ‘నేను’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అర్చన తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటించింది. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్‌ వన్‌లో పోటీపడింది.
actress
Archana
Veda
Tollywood

More Telugu News