ఇండియా వచ్చేస్తున్నా... లేటెస్ట్ లుక్ తో పోస్టు పెట్టిన రానా

  • రానా ఆరోగ్యస్థితిపై ఊహాగానాలు
  • మరో 72 గంటల్లో ఇండియాలో అడుగుపెడతానంటూ పోస్టు
  • ఎలాగున్నారంటూ అభిమానులను పలకరించిన రానా
ఇటీవల దగ్గుబాటి రానా ఫొటోలు చూసినవాళ్లు ఎంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. బాహుబలిలో కండలరాయుడిగా కనిపించిన ఈ పొడగరి, ఇప్పుడు ఎంతో బలహీనంగా దర్శనమిస్తున్నాడు. అనారోగ్యం బారినపడ్డాడని, అమెరికాలో చికిత్స తీసుకుంటున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  నేపథ్యంలో తాజాగా, రానా ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టాడు. మూడ్రోజుల్లో ఇండియాకు వచ్చేస్తున్నానన్నది ఆ పోస్టు సారాంశం. ఆన్ లైన్ లోనూ మళ్లీ సందడి మొదలుపెట్టానని, మరో 72 గంటల్లో ఇండియాలో వాలిపోతానని తెలిపాడు. అంతేకాదు, ఏంచేస్తున్నారు? ఎలాగున్నారు? అంటూ తన అభిమానులను ఆప్యాయంగా పలకరించాడు.
Go Back to Shorts
Rana
India
USA
Tollywood

More Telugu News