జనసేనకు గుడ్ బై చెప్పిన చింతల పార్థసారథి
- అనకాపల్లి ఎంపీగా పోటీచేసిన పార్థసారథి
- ప్రభుత్వ పథకాల మానిటరింగ్ కమిటీ చైర్మన్ గా నియమించిన పవన్
- పవన్ వైఖరి పట్ల అసంతృప్తి చెందాడంటూ ప్రచారం
అయితే కొంతకాలంగా పార్థసారథి పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీకి, మానిటరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. కాగా, పార్థసారథి ఏ పార్టీలో చేరతారన్నది ఇంకా స్పష్టం కాలేదు.