ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదు.. 5 నుంచి సమ్మెలోకి వెళ్తున్నాం: టీఎస్ఆర్టీసీ ఐకాస
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదు.. 5 నుంచి సమ్మెలోకి వెళ్తున్నాం: టీఎస్ఆర్టీసీ ఐకాస

  • సోమేశ్ కుమార్ కమిటీతో జరిగిన చర్చల్లో హామీ రాలేదు
  • మా 26 డిమాండ్లను పరిష్కరించేంత వరకు పోరాడుతాం
  • ఆర్టీసీ కార్మికులంతా పోరాటానికి సిద్ధం కావాలి
ఈ నెల 5వ తేదీ నుంచి సమ్మె చేపట్టబోతున్నామని టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. సోమేశ్ కుమార్ కమిటీతో జరిగిన చర్చల్లో ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదని చెప్పారు. సమస్య పరిష్కారం దిశగానే తాము కూడా ఆలోచిస్తున్నామని... అయితే తమ డిమాండ్లను నెరవేర్చేలా ప్రభుత్వం కూడా కృషి చేయాలని అన్నారు. గతంలో కూడా ప్రభుత్వం కమిటీలను వేసిందని... అవి నివేదికలు ఇవ్వలేదని చెప్పారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతో పాటు తమ 26 డిమాండ్లను పరిష్కరించేంత వరకు పోరాడతామని తెలిపారు. తమ డిమాండ్లలో 2, 3 అంశాలు తప్ప మిగిలిన అంశాలన్నీ పరిష్కరించేవేనని చెప్పారు. ఆర్టీసీ కార్మికులంతా పోరాటానికి సిద్ధం కావాలని విన్నవించారు.
TSRTC
Stirike
Telangana

More Telugu News